ఒంగోలు అర్బన్: ఒంగోలు టంగుటూరు జాతీయ రహదారిపై వెళ్తున్న కారుని వెనకనుంచి ఢీ కొట్టిన లారీ, ఇద్దరికీ గాయాలు
Ongole Urban, Prakasam | Aug 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు టంగుటూరు జాతీయ రహదారిపై ఆదివారం ముందు వెళ్తున్న కారుని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని స్థానిక ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే హైవే పోలీసులు స్పందించి కారుని రోడ్డుకు అడ్డంగా ఉండడాన్ని తొలగించారు. మరో ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిన ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.