పార్వతీపురం: ఆర్టీసీని ప్రైవేటుపరం చేయొద్దు: ఏపీఎస్ ఆర్టీసీపై సిఐటియు నిరసన
పాలకొండలో ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు నిరసన. విద్యుత్తు బస్సుల పేరుతో పినాకిల్ సంస్థకు ఆర్టీసీని అప్పగించవద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీతో పాటు ఆర్టీసీని ప్రభుత్వమే బలోపేతం చేయాలని కోరారు.