రాజోలు: రాజోలులో భారీ వర్షం: జలమయమైన జాతీయ రహదారి, ముంపులో 18 ఎకరాల కాలనీ
రాజోలు మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, జాతీయ రహదారి జలమయమయ్యాయి. శివకోడు, పొదలాడ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడగా, 18 ఎకరాల కాలనీ ముంపునకు గురైంది. కనీస సౌకర్యాలు లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.