జగ్గంపేట: గోకవరం: చీటీల వ్యవహారంతో మహిళ ఆత్మహత్యాయత్నం
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం ఎల్లంపేటలో చీటీల గొడవల వల్ల కొప్పిశెట్టి సుజాత అనే మహిళ విషపదార్థం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సభ్యులు డబ్బులు చెల్లించకపోవడంతో వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి ఈ ఘోరానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.