గద్వాల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి:నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్
గద్వాల జిల్లా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటానికి ఎప్పుడు ముందుండాలని అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు హరిత హోటల్ నందు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.