జనగాం: జనగామ మున్సిపల్ సమావేశంలో రసాభాస: క్షమాపణలకు పట్టుబట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుగుణాకర్ చేసిన వ్యాఖ్యల వల్ల గందరగోళం నెలకొంది. కమిషనర్, చైర్పర్సన్లపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన తెలపగా, బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.