ఆళ్లగడ్డ: అయ్యలూరు శివారులో ముళ్ల పొదల్లో చిన్నారి
నంద్యాల జిల్లా అయ్యలూరు గ్రామ శివారులో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ముళ్లపదలో వదిలేశారు, కే.సి కెనాల్ సమీపంలోని ముళ్ళ పొదల్లో చిన్నారి ఏడుపులు అటుగా వెళుతున్న గ్రామస్తులు విని అక్కున చేర్చుకున్నారు ఆ చిన్నారికి పాలు తాగించి ఆకలి తీర్చారు, అనంతరం 108 వాహనం ద్వారా ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది