వనపర్తి: వనపర్తి ఆర్టీసీ డిపో రికార్డు: రాఖీ ప్రత్యేక బస్సులతో 137% ఓఆర్ సాధన
రాఖీ పౌర్ణమి సందర్భంగా అదనపు బస్సులను నడిపి వనపర్తి ఆర్టీసీ డిపో 137% ఆక్యుపెన్సీ రేషియో (OR) సాధించింది. ఈ విజయంలో పాలుపంచుకున్న సిబ్బందిని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ అభినందిస్తూ స్వీట్లు పంపిణీ చేశారు.