వెంకటగిరి డివిజన్ ఆలోచన TDPదే : MLA కురుగొండ్ల
Gudur, Tirupati | Oct 31, 2025 వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ చేయాలన్నది TDP అజెండానేనని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెప్పారు. జిల్లాల పునర్విభజన సమయంలోనే సీఎం చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం ఇచ్చానన్నారు. వెంకటగిరి డివిజన్ పై ఎమ్మెల్యే పోరాడాలని ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ప్రజలకు మెరుగైన పాలన, సేవలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.