సిరిసిల్ల: సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడే స్థాయికి కేటీఆర్ ఎదిగాడని తాను అనుకోవడం లేదు నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాట్లాడే స్థాయికి కేటీఆర్ ఎదిగాడని తాను అనుకోవడంలేదని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాట్లాడే స్థాయికి కేటీఆర్ ఎదిగాడని తాను అనుకోవడం లేదని తన స్థాయికి తగ్గట్టు కేటీఆర్ మాట్లాడాలని అన్నారు.