బనగానపల్లె: మూడు నాలుగు స్థానాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్
సీఎం చంద్రబాబు ప్రకటించిన మంత్రుల పనితీరు జాబితాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టాప్-3లో నిలిచినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. ఈ-ఫైళ్ల పరిష్కారంలో 148 దస్త్రాలను క్లియర్ చేసి, రాష్ట్రంలో 3వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొంది. ఒక్కో దస్త్రానికి సగటున 6 గంటల 52 నిమిషాల్లో పరిష్కారం చూపారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నాలుగో స్థానంలో నిలిచారు.