ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలోని నందిపాడు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా, ఒకరు మృతి నలుగురికి గాయాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Aug 23, 2026
ప్రకాశం జిల్లాలోని నందిపాడు గ్రామం నుంచి ఆటోలో సుమారు 10 మంది (ఒడిశాకి చెందిన వారు) మద్దిపాడు వస్తుండగా మార్గమధ్యలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న ఒకరు సంఘటనా స్థలంలో మృతి చెందగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.