ఆళ్లగడ్డ: మద్యం మత్తులో బైక్ నడిపిన వ్యక్తికి తొలి నేరంగా భావించి 10000 జరిమానా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో బైక్ నడిపిన నాగరాజుకు కోర్టు పదివేలు జరిమానా వేధించింది, సెప్టెంబర్ 8న పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సై శ్రీనివాసరావు వాహన తనిఖీలు నిర్వహించారు, బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా నాగరాజు మద్యం తాగినట్లు తేలింది దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని స్పెషల్ మెజిస్ట్రేట్ రవికుమార్ ఎదుట హాజరు పరచారు, తొలి నేరంగా భావించి నాగరాజుకు 10000 జరిమానా విధించారు