మామిడికుదురు: అల్పపీడన ప్రభావం: మండలంలో భారీ వర్షాలు, పండుగ వ్యాపారాలకు తీవ్ర అంతరాయం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మండలవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి వేళ విగ్రహాలు, పూలు, పండ్ల విక్రయాలు దెబ్బతినడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.