ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి, ఎకో వారియర్ జె వి రత్నం పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సెంట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో గ్రీన్ గ్లోబ్ నేచర్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ కె మాణిక్య కుమారి నేతృత్వంలో నిర్వహించిన వెల్డిక్టరి సమావేశం లో ఆయన మాట్లాడారు. జి విఎంసి పరిధి లో అమలవుతున్న ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని కోరారు. భూమి మీద ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మీదే పడుతుంది అని హెచ్చరించారు. వేసవిలో మనం ఆహారంగా తీసుకునే దేశీయ పండ్ల విత్తనాలు సేకరించి విత్తన బంతులు తయారు చేసి సామాజిక వనాలు పెంచాలి అని కోరారు.