ఖిలా వరంగల్: వరంగల్లో అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత: 22 క్వింటాళ్లు స్వాధీనం
వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం మామునూరులో అక్రమ పీడీఎస్ బియ్యం నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అణకట్ల నవీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 22 క్వింటాళ్ల బియ్యంతో పాటు రూ. 1,06,450 విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.