నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ లో అక్టోబర్ 2న మాంస విక్రయాలపై నిషేధం
గాంధీ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ లో మాంసాహార దుకాణాలను మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఆదేశించారు. అక్టోబర్ 2న అన్ని రకాల చికెన్, మటన్ షాపులు, వధశాలలు మూసి ఉంచాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.