వికారాబాద్: ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర
వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్ర పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా సమస్యలను పోలీస్ శాఖకు తెలపవచ్చని ఆమె పేర్కొన్నారు.