పాలకొండ: ఏపీలో అల్పపీడనం: నేడు, రేపు భారీ వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండండి
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలపై అల్పపీడనం కారణంగా ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.