కాకినాడ సిటీ: కాకినాడ మున్సిపల్ ఎన్నికలు: 26న పోలింగ్, 30న ఫలితాలు - పూర్తి వివరాలు ఇవే
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. మొత్తం 66 వార్డుల్లో 306 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.