మార్కాపురం: చిన్నారికట్ల స్కూల్ చైర్మన్ ఎన్నిక వాయిదా: అధికారుల తీరుపై గ్రామస్తుల అసహనం
చిన్నారికట్ల జడ్పీ హైస్కూల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్కూల్కు వచ్చిన డిప్యూటీ డీఈఓను ఎన్నిక నిర్వహించాలని కోరగా, పదేపదే కలెక్టర్కు ఫోన్ చేయవద్దని ఆయన కోరారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.