జనగాం: నల్లగొండలో AIKS 36వ జాతీయ మహాసభలు: వాల్ పోస్టర్ ఆవిష్కరణ
జనగామలో AIKS 36వ జాతీయ మహాసభల పోస్టర్ను సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ఆవిష్కరించారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో ఈ సభలు జరగనున్నాయి. 15న జరిగే భారీ బహిరంగ సభకు బృందా కారత్ ముఖ్య అతిథిగా రానున్నారు. దేశవ్యాప్త రైతాంగ సమస్యలు, ఉద్యమ కార్యాచరణపై ఇక్కడ చర్చించనున్నారు.