గద్వాల్: బీచుపల్లి కృష్ణా నదిలో ఆత్మహత్యాయత్నం: ప్రాణాలు కాపాడిన మత్స్యకారుడు
తండ్రి వేధింపుల వల్ల విరక్తి చెందిన యువతి బీచుపల్లి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన మత్స్యకారుడు ముదిరాజ్ బాబు ఆమెను కాపాడారు. ఇటిక్యాల పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.