వరంగల్: ముగిసిన 5వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026: విజేతలకు బహుమతుల అందజేత
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన 5వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ఘనంగా ముగిసింది. సుమారు 2,000 మంది పోలీస్ క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విజేతలకు ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.