గద్వాల్: గద్వాలలో తప్పిన పెను ప్రమాదం: 50 మంది విద్యార్థులతో చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ పరిసరాల్లో స్కూల్ బస్సు ప్రమాదం జరిగింది. స్టీరింగ్ రాడ్ విరగడంతో బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.