నందికోట్కూరు: పోతిరెడ్డిపాడు భద్రతపై ఎటువంటి అనుమానాలు వద్దు ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని శుక్రవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు,తొమ్మిదవ గేటుకు సంబంధించిన తీగ తెగిపోయి గేటు కొట్టుకుపోయిందని, నీరు వృథాగా పోతోందని కొన్ని ప్రచార మాధ్యమాల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు,రెగ్యులర్ మెయింటెనెన్స్ చెకింగ్‌లో భాగంగా 9వ గేటు తెరవడానికిప్రయత్నించినప్పుడు తీగ తెగిపోవడం వాస్తవమేనని, అయితే దీనివల్ల ఎటువంటి లీకేజీ కానీ, ప్రాజెక్టుకు నష్టం కానీ జరగలేదని తెలిపారు,తెగిపోయిన తీగలను రెండు మూడు రో