నాగర్ కర్నూల్: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత: కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వయోవృద్ధులకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించాలని, వారిని కుటుంబ సభ్యులు గౌరవంగా చూసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు.