గుంతకల్లు: పట్టణంలోని 9వ వార్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని 9వ వార్డులో ఉన్న రాజేంద్రప్రసాద్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం ఎమ్మెల్యే పాఠశాలలోని తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.