గద్వాల్: పేద ప్రజలకు రక్షణగా భీమ్ ఆర్మీ ఉంటుంది:భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్
భీమ్ ఆర్మీ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా మెల్లచెరువు వర్షిత్ ఆధ్వర్యంలో జరిగిన భీమ్ ఆర్మీ కేటీ దొడ్డి మండల కేంద్రంలోని ఆదివారం మధ్యాహ్నం సమావేశంలో భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు రక్షణగా భీమ్ ఆర్మీ ఉంటుందని, ప్రతి ఒక్కరు సామాజిక చైతన్యం కావాలని , రాజకీయ చైతన్యం కావాలని అంబేద్కర్ కాన్సిరాం ,ఆశయాలను ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు,