ప్రత్తిపాడు: వైసీపీకి షాక్, టీడీపీలో చేరిన 40 కుటుంబాలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమక్షంలో టీడీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే ఈ చేరికలు జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు.