కుప్పం: లక్ష్మీపురంలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు: ఆందోళనలో గ్రామస్థులు
బల్ల పంచాయతీ లక్ష్మీపురంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయి. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ లైన్లను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.