రాజమండ్రి సిటీ: అరుదైన ‘ముంబై ఫినో టైప్’ రక్తాన్ని ఉచితంగా అందజేసిన జక్కంపూడి ఫౌండేషన్
పల్నాడు జిల్లాకు చెందిన గర్భిణీకి అవసరమైన అత్యంత అరుదైన ‘ఓ పాజిటివ్ ముంబై ఫినో టైప్’ రక్తాన్ని రాజమహేంద్రవరంలోని జక్కంపూడి ఫౌండేషన్ ఉచితంగా సమకూర్చింది. లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఉండే ఈ రక్తాన్ని వారం రోజుల అన్వేషణ తర్వాత ఫౌండేషన్ ద్వారా సేకరించి అందించారు.