చింతలపాలెం: చింతలపాలెం మండలంలో రూ.23 కోట్లతో డబుల్ రోడ్డు పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీకారం
చింతలపాలెం మండలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. మేళ్లచెరువు-చింతిర్యాల మధ్య డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపనతో పాటు, రేబల్లెలో నూతన గ్రామ పంచాయతీ, మహిళా శక్తి భవనాలను ఆయన ప్రారంభించారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.