గ్రామస్థుల ఆశీర్వాదంతోనే ఇస్కపల్లి గద్దె నుంచి ఢిల్లీ వరకు వెళ్ళానని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు తెలిపారు. అల్లూరు మండలం ఇస్కపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జేఆర్ఆర్ ట్రస్ట్ ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీద మస్తాన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్కపల్లిలో తాము చదువుకునే సమయంలో ప్రభుత్వాలు కానీ, దాతలు కానీ సౌకర్యాలు కల్పించలేదన్నారు. సైకిల్ కొనిచ్చేందుకు మా తండ్రి ఎన్నో బాధలు పడినట్లు గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులు నా సొంతూరు ఉన్నత పాఠశాలలో ఉండకూడదనే తాము అన్న