పలమనేరు: పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ శివశంకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్సార్ మరణం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఒకేసారి జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా నిస్తేజంలో ఉన్నారు. రాహుల్ గాంధీ శ్రీకృష్ణుడు రేవంత్ రెడ్డి అర్జునుడు షర్మిలమ్మ ఆదిపరాశక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరియు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన అన్నను గెలిపించుకునేందుకు సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకున్నారు. తర్వాత విభేదించి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు.