జఫర్గఢ్: మాజీ మావోయిస్టు ఇన్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు: విధించిన షరతులు ఇవే
జనగామ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు ఇన్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. యూఏపీఏ కేసులో ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆయనకు రూ.25 వేల పూచీకత్తుతో పాటు, ప్రతి శుక్రవారం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో హాజరు కావాలనే షరతులతో కోర్టు బెయిల్ ఇచ్చింది.