జగిత్యాల: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన జగిత్యాల జ్యోతి హైస్కూల్ విద్యార్థినులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన జగిత్యాల జ్యోతి హైస్కూల్ విద్యార్థినులు ఎం. నిత్యశ్రీ, బి. సురక్షిత. నవంబర్ 13న కామారెడ్డి జిల్లా బీబీపేటలో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొననున్నారు.