కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో యోగ సూర్య నమస్కారాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద గురువారం రాష్ట్ర మారి టైం బోర్డు ఛైర్మన్ దాంచర్ల సత్య సూర్య నరమస్కారాలు చేశారు. యోగా వలన ఉండే ఉపయోగాలను ఆయన వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యోదయాన ప్రతి రోజూ యోగ అలవాటు చేసుకోవాలని చెప్పారు. యోగాతో జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.