సూర్యాపేట: ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, పైరవీలు లేకుండా చట్టప్రకారం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని ఎస్పీ స్పష్టం చేశారు.