నెక్కొండ: నెక్కొండలో కిరాణా దుకాణంపై పోలీసుల దాడి: 100 కిలోల పటిక, 60 కిలోల బెల్లం సీజ్
వరంగల్ జిల్లా నెక్కొండలోని రాజేష్ కిరాణా దుకాణంలో ఎస్సై శ్రావణ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న 100 కిలోల పటిక, 60 కిలోల బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు.