పలమనేరు: మున్సిపల్ కమీషనర్ రమణా రెడ్డి తెలిపిన సమాచారం మేరకు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ పలమనేరు పురపాలక సంఘానికి విచ్చేసి గొబ్బిళ్ళ కోటూరు కంపోస్టు యార్డును సందర్పించారు. సదరు ప్రాంతంలో నిర్వహిస్తున్న లెగసీ వేస్ట్ నిర్వహణ, వ్యర్థాల పునర్వినియోగము తడి చెత్త పొడి చెత్త నిర్వహణ మరియు కంపోస్ట్ ఎరువు తయారీ తదితర వాటిని తనిఖీ చేసారు. అనంతరం మున్సిపల్ కార్యాలయము నందు పారిశుధ్య కార్మికులు, శానిటరి సెక్రటరీలు మరియు అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.