బనగానపల్లె: కొలిమిగుండ్ల లో యువతి అదృశ్యం,కేసు నమోదు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రానికి చెందిన జడలమ్మ గారి స్రవంతి అనే యువతి గురువారం ఉదయం అదృశ్యమైనట్లు కొలిమిగుండ్ల CI రమేశ్ బాబు వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున నిద్ర నుంచి లేచిన స్రవంతి, కొద్దిసేపటి తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిందని CI తెలిపారు. యువతి తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI రమేశ్ బాబు తెలిపారు.