బాపట్ల: తుఫాను బాధితులకు అండగా ఏపీ స్టేట్ లెప్రసీ సొసైటీ, 135 మందికి సహాయం
బాపట్ల బెతనీ కాలనీలో తుఫాను వల్ల ఆశ్రయం కోల్పోయిన 135 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు ఏపీ స్టేట్ లెప్రసీ సొసైటీ నిత్యావసరాలను పంపిణీ చేసింది. బాపట్ల సీఐ ఆర్. రాంబాబు చేతుల మీదుగా బ్రెడ్, పాలు, బిస్కెట్లను బాధితులకు అందజేశారు.