గన్నవరం: కేసరపల్లిలో ఉద్రిక్తత: సీఐని నిలదీసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
కేసరపల్లిలో వినాయక మండపం ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంపై వివాదం చెలరేగింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీఐ శివప్రసాద్‌ను నిలదీశారు. పోలీస్ స్టేషన్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.