విశాఖపట్నం: టీడీపీ ఎంపీ భరత్ గారితో భేటీ అయిన మజ్జి శ్రీనివాసరావు
టీడీపీలో చేరిన అనంతరం మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు విశాఖ ఎంపీ భరత్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయ అభివృద్ధి, ప్రజల సమస్యలు మరియు భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు.