అమలాపురం: కోనసీమలో కొబ్బరి వ్యర్థాలతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ కొత్త ప్రణాళిక
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి వ్యర్థాల నుంచి బయోచార్ తయారీ ద్వారా మహిళా సంఘాలకు స్వయం ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ నిర్ణయించారు. వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చి, మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.