గద్వాల్: జాతీయ రహదారుల భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు
సోమవారం మధ్యాహ్నం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.