అనకాపల్లి: 10 నిమిషాల్లో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు
అనకాపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణాల పంపిణీని కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రారంభించారు. అగ్రిస్టాక్ ద్వారా కేవలం 10 నిమిషాల్లో రుణాలు మంజూరు కానున్నాయి. 80,000 మంది రైతులను ప్రాథమికంగా ఎంపిక చేశారు. జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.