జఫర్గఢ్: జనగామలో రూ.1,400 కోట్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బీజేపీ నేత
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిడుగు గ్రామంలో పర్యటించిన బీజేపీ నేత పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విమర్శలు చేశారు. నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు ఎక్కడ జరిగాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.