అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ రిమ్స్‌కు పెరిగిన పీజీ వైద్య సీట్లు: అదనంగా 18 సీట్ల మంజూరు
ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)కు అదనంగా 18 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక కృషి ఫలితంగా ఈ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల వైద్య విద్య మెరుగుపడటంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.